గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్ట్‌ స్టే

0
874


అమరావతి : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలను 4 వారాలపాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 8 పిటిషన్లపై నిన్న (మంగళవారం) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరోసారి ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇంటర్వ్యూలను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ స్టే విధించింది. దీంతో ఎపిపిఎస్‌సి విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా.. హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ పక్రియ వాయిదా పడింది. కాగా, హైకోర్టు ఆదేశాలతో గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో ఇంటర్వ్యూల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఎపిపిఎస్‌సి వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here