హత్య చేస్తే శిక్ష ఎంత పడుతుంది? కొంతమందికి తక్కువ శిక్ష ఎందుకు పడుతుంది?

0
833

సెక్షన్‌ 302 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం హత్య చేసిన వారికి జీవిత ఖైదు కానీ, మరణ శిక్ష కానీ విధించవచ్చు. కొన్ని సందర్భలలో ఉరిశిక్ష కూడా విధించవచ్చు. హత్య చేస్తే సాధారణంగా ఈ మూడు రకాల శిక్షల్లో ఏదోకటి విధించే అవకాశముంది. సర్వసాధారణంగా హత్య కేసులో జీవిత శిక్ష విధిస్తారు. కానీ హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్య జరిగిన తీరును బట్టి శిక్ష మారుతూ ఉంటుంది. ఎన్నాళ్ల నుంచో కుట్ర పన్ని, కక్ష పెంచుకొని పధకం ప్రకారం హత్య చేస్తే మరణ శిక్ష విధిస్తారు. జీవిత ఖైదు అంటే 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి. అదే మరణ శిక్ష అంటే చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి. కోపంలోనో, ఆవేశంలోనో హత్య చేస్తే జీవిత ఖైదు విధిస్తారు. కానీ కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధిస్తారు. ఆ హత్యను చాలా క్రూరాతిక్రూరంగా సమాజంలో భయాన్ని నెలకొల్పేదిగా ఉంటే ఆ కేసుల్లో ఉరిశిక్ష విధిస్తారు. సెక్షన్‌ 302లో వాస్తవానికి ఉరిశిక్ష లేదు. బ్రిటీష్‌ కాలంలో ఉరిశిక్ష అమలుచేసేవారు. కానీ మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనిషిని ఉరి వేయడం తప్పు అని భావించారు. కానీ కొన్ని అతి ప్రత్యేక కేసుల్లో ఉరిశిక్ష విధిస్తున్నారు. 2012లో ఢిల్లీలో నిర్భయను ఓ ఆరుగురు అతి క్రూరంగా అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఈ కేసులో న్యాయస్థానం నలుగురికి ఉరిశిక్ష విధించింది. నిర్భయకు న్యాయం జరగాలని, నిందితులకు ఉరిశిక్ష వేయాలని దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. నిందితులు శిక్ష తప్పించుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లినప్పటికీ నలుగురు నిందితులకు మాత్రం ఉరిశిక్ష విధించారు. ఒక నిందితుడు విచారణ సమయంలోనే చనిపోయాడు. మరోకరు బాల నేరస్తుడని భావించి బాలల జైలుకు పంపించారు. విచక్షణారహితంగా ప్రజల ప్రాణాలు తీసే టెర్రరిస్టులకు కూడా ఉరిశిక్ష విధిస్తారు. ముంబయి మారణ కాండ కేసులో కసబ్‌ను అదే విధంగా ఉరితీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here