తండ్రి లేడనే బాధతో కూతురు, తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు

0
900

తాడిపత్రి: ప్రపంచాన్ని కబళించిన కరోనా తాడిపత్రిలోని ఓ చిన్న కుటుంబాన్ని కూడా పూర్తిగా మింగేసింది. పుట్లూరు మండలం చింతరపల్లి గ్రామానికి చెందిన రామకృష్టా రెడ్డి తన భార్య వెంకట రమణమ్మ, కుమార్తె అపర్ణతో కలిసి తాడిపత్రిలోని కృష్ణాపురం రోడ్డులో నివాసముంటున్నారు. అపర్ణ ప్రభుత్వ సచివాలయంలో సర్వేయర్‌గా పని చేస్తోంది. కొద్ది రోజుల క్రితం రామకృష్ణారెడ్డి కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి,కూతర్లు ఇద్దరూ కుటుంబానికి పెద్ద దిక్కు లేడే అని బాధపడుతూ ఉండేవారు. ఆ బాధ రాను రాను వారిలో ఎక్కువయి పోయింది. తండ్రి లేని జీవితం తమకు అక్కర్లలేదని కూతురు, తల్లి భావించారు. దీంతో పురుగులు మందు తాగి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here