కళ్లు కానరాని అమ్మమ్మ ఎదురుగా మూగ యువతిపై సామూహిక ఆత్యాచారం

0
898

ఆ యువతికి మాటలు రావు. తల్లి చనిపోవడంతో అమ్మమ్మ ఇంట్లో తండ్రితో కలిసి ఉంటుంది. తండ్రి రోజూ పనికిపోతాడు. అమ్మమ్మకు కళ్లు సరిగ్గా కనపడవు. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకున్న ఆ ప్రాంతంలో ఉండే ముగ్గురు యువకులు తెగబడ్డారు. ఇంట్లోకి ప్రవేశించి మూగ యువతపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురిలో ఒకరు ముసలమ్మను కదలనీయకుండా అక్కడే ఉండగా మిగిలిన ఇద్దరు ఆత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమెను నగంగా వీడియో తీశారు. ఈ ఘటన వరంగల్‌లోని మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. తండ్రి వచ్చిన తర్వాత ఆ యువతి ఏడుస్తూ ఉండగా ఏంటని కనుక్కొగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆ తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. వీరిలో ఇద్దరు మైనర్లు అని, ఒకరు యువకుడని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here