ఏదైనా భూమిని కొనేముందు చెక్‌ చేసుకోవాల్సిన పత్రాలేంటి?

0
756


ఏదైనా భూమిని మీరు కొనాలంటే నాలుగు పత్రాలను మీరు తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. వారి వద్ద ఉన్న విక్రయ దస్తావేజు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత వారి వద్ద ఆ భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. లింక్‌ డాక్యుమెంట్‌ కనీసం 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు ఉండాలి. అదే విధంగా రిజిష్ట్రార్‌ కార్యాలయం నుంచి ఆ భూమికి సంబంధించి ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ అంటే ఇసి తీసుకొని అసలు భూమి వారిదేనా, విక్రయ దస్తావేజు సరైన దేనా కాదా అనేది చెక్‌ చేసుకోవాలి. వీటితోపాటు ఆ భూమికి లేదా ఆస్తికి సంబంధించి ప్రభుత్వానికి కట్టిన పన్నుల రశీదులను కూడా చెక్‌ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here