ఆ దంపతులకు పిల్లలు లేకుంటే వారు చనిపోతే ఆస్తి ఎవరికి వెళుతుంది?

0
682


ఒక వేళ దంపతులకి పిల్లలు లేక వారు ఎవ్వరికీ ఆస్తి రాయకుండానే చనిపోతే….అది భర్తకు చెందిన ఆస్తి అయితే అతని దగ్గరి రక్త సంబధికులకు ఆ ఆస్తి చెందుతుంది. అంటే అన్న,తమ్ముడు, అక్క, చెల్లెలు, అమ్మ,నాన్నలకు వెళుతుంది. వీరేవ్వరూ కూడా లేకపోతే బాబాయి, పెదనాన్న, మేనత్తలకు వెళుతుంది. అదే భార్యకు ఆస్తి ఉంటే అది ఆమె పుట్టింటి వారికి చెందుతుంది. ఇక్కడ భార్యతోపాటు భర్త కూడా చనిపోతున్నాడు కాబట్టి భార్యకు చెందిన ఆస్తి ఆమె పుట్టింట్లో అన్నా, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్నలకు సమానంగా చెందుతుంది. భార్య స్వంతంగా సంపాదించిన, పుట్టింటి నుండి ఆస్తి రెండూ పుట్టింటికే చెందుతుంది. ఒక వేళ భార్య చనిపోతే భర్త బతికే ఉంటే ఆమె ఆస్తిపై సర్వహక్కులు భర్తకే ఉంటాయి. పిల్లలు ఉంటే పిల్లలకు కూడా సమాన హక్కులు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here